
కుటుంబ సాధికార సారథుల ఏర్పాటు వేగవంతంగా చేయాలి…!
టిడిపి బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి..
చిలకలూరిపేట : కుటుంబ సాధికార సారథుల ఏర్పాటు వేగవంతంగా పూర్తి చేయాలని పార్టీ నియోజకవర్గ పరిశీలకులు దాసరి ఉషారాణి అన్నారు.
మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు
స్థానిక ప్రత్తిపాటి క్యాంపు కార్యాలయంలో
నియోజకవర్గ పరిధిలోని సాధికార సారథులు నియామకాలపై సమీక్షా జరిపారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ ఈ నేల 20 తేదీ లోపు
సాధికార సారథుల నియామకాలు పూర్తి చేయాలని రాష్ట్ర పార్టీ ఆదేశాలివ్వడం జరిగిందని నాయకులకు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకే కుటుంబ సాధికార సారథుల నియామకాలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ కారం చుట్టారని తెలిపారు .సాధికార సారథుల నియామకాలు ఏర్పాటు పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయవలసిన అవసక్యత
ఉందని రాబోయే పార్టీ సంస్థాగత ఎన్నికలు..స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు
కుటుంబ సాధికార సారథుల నియామకాలు త్వరతిగతిన పూర్తి చేయనున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి షేక్ కరిముల్లా.మండల పార్టీ అధ్యక్షుడు జవ్వాజి మదన్మోహన్.
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు.పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్.పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దు మాల రవి.మాజీ కౌన్సిలర్ ఏలూరి తిరుపతయ్య..తదితర నాయకులు పాల్గొన్నారు
