
ఉద్యమస్ఫూర్తిని రగిలించిన జెండా….తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జెండా…తెలంగాణ ప్రజలకు ఎల్లవేళలా రక్ష ఈ జెండా : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
“ఛలో వరంగల్” బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ముస్తాబైంది. ఈ వేడుకల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జగద్గిరిగుట్ట మగ్దూం నగర్లో పార్టీ జెండా దిమ్మెకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గులాబీ రంగును వేస్తూ నాయకులు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఉద్యమస్ఫూర్తిని రగిలించిన జెండా….తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జెండా… అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా తెలంగాణ అభివృద్ధిని గత పదేళ్ల కాలంలో ఉరుకులు పెట్టించినది ఈ జెండా… ప్రజాసంక్షేమాన్ని విస్మరించే ప్రభుత్వాలను నిగ్గదీస్తూ తెలంగాణ ప్రజలకు సంక్షేమాన్ని అందించే విధంగా పాలకుల మెడలు వంచేది ఈ జెండా…. తెలంగాణ ప్రజలకు ఎల్లవేళలా రక్ష ఈ జెండా…. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఈ జెండా, మన జెండాను గులాబీ జెండా రజతోత్సవ వేడుక పండుగకు జగద్గిరిగుట్ట డివిజన్ నుంచి భారీగా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లి ఛలో వరంగల్ సభను విజయవంతం చేయాలి.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, సీనియర్ నాయకులు పాపులు గౌడ్, శశిధర్, అజం, శశిధర్ ముదిరాజ్, ముంతాజ్, రామరాజు,మహేందర్ రెడ్డి, జైహింద్, నర్సింగ్ గౌడ్, రాములు, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
