TEJA NEWS

విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్ద పీట….

గ్రామీణ ప్రాంత ప్రజల అందుబాటులోకి వైద్య సేవలు…..

గ్రామాలలో ఆరోగ్య ఉప కేంద్రాల ఏర్పాటు…..

ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..

గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో 20లక్షల వ్యయంతో ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల, నష్కల్ గ్రామాలలో నూతంగా మంజూరు అయిన ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ రోజు శంకుస్థాపన చేసుకున్న ఆరోగ్య ఉప కేంద్రాలను 6నెలల్లో పూర్తి చేసి చిన్నపెండ్యాల, నష్కల్ గ్రామాల ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో పని చేస్తున్నామని అన్నారు. చిన్నపెండ్యాల గ్రామంలో ఎస్సీ కాలనీ ప్రధాన రోడ్డును సిసి రోడ్డు మరియు ఆర్ అండ్ బీ రోడ్డు నుండి హెల్త్ సబ్ సెంటర్ వరకు సిసి రోడ్డుకు త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి 55ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇచ్చానని త్వరలో మరిన్ని ఇల్లు మంజూరు ఇస్తానని తెలిపారు.

25ఏళ్ల క్రితం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడే నష్కల్ గ్రామానికి బీటి రోడ్డు వేసానని అన్నారు. నష్కల్ నుండి ఉప్పుగల్ వరకు బీటి రోడ్డు నిర్మాణం మరియు మధ్యలో వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించానని త్వరలోనే మంజూరు వస్తుందని అన్నారు. అలాగే నష్కల్ ప్రధాన రోడ్డును రామాలయం వరకు రోడ్డు వెడల్పు మరియు సిసి రోడ్డు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో ఉందని, కావున ఒక్కొక్కటిగా అన్ని పనులు పూర్తి చేసుకుందామని తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నేను మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తానని, ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. దానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.