
తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర తో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి……….. బి.ఆర్ .ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్
కురిసిన అకాల వర్షాలకు కళ్ళాళ్లలో నిలువ ఉన్న ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్ట పోయారని ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బి.ఆర్.ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు.
రజతోత్సవ సన్నాహక సమావేశం సందర్భంగా సోమవారం వాకిటి శ్రీధర్ మండలములోని అంకూర్ గ్రామములో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులు పడుతున్న బాధల్ని స్వయంగా విని చలించిపోయారు.
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలములో కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల తడిసిపోవడం జరిగిందని 20రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
ధాన్యం కొనుగోలు చేయకపోవడం కాక వడ్లలో తేమ శాతం ఉందని తాలు ఉందని కుంటి సాకులు చేపడమేటని ప్రశ్నించారు.
వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని లేకపోతే బి. ఆర్.ఎస్ తరపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
వాకిటి శ్రీధర్ వెంట మాణిక్యం, రవిప్రకాశ్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు.
