TEJA NEWS

The last rites of an orphaned corpse - humanitarian villagers

అనాధ శవానికి అంతిమ సంస్కారాలు – మానవత్వం చాటుకున్న గ్రామస్తులు

సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఒక అనాధ యాచకుడి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చాటుకున్న టేకుమట్ల గ్రామస్తులు. గుణగంటి రమణయ్య అనే వ్యక్తి సుమారు 35 సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువుకు తన భార్య రమణమ్మను తీసుకొని జగ్గయ్యపేట నుండి సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి వలస వచ్చారు…..
కొంతకాలం దొరికిన పని చేసుకుంటూ జీవనం వెళ్లదీసారు కాలక్రమేనా పనిచేయడానికి శరీరం సహకరించక యాచకునిలా మారి భిక్షాటన చేసుకుంటూ భార్యను పోషిస్తున్నాడు. రోజూలాగే సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో భిక్షాటన చేసుకొని తిరిగి ఇళ్లు చేరుకున్నాడు. సాయంత్రం తన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంట్లో తన భార్య రమణమ్మ మాత్రమే ఉంది ఆమెకు మతిస్థిమితం సరగా ఉండదు. విషయం తెలుసుకున్న స్థానికులు రమణయ్య మృతదేహాన్ని వర్షానికి తడవకుండా ఇంట్లోకి పట్టారు…..
మంగళవారం స్థానికులు గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం అందించడంతో గ్రామ కార్యదర్శి నరసింహరావు మల్టీపర్పస్ ఉద్యోగులను, ట్రాక్టర్, JCB పంపించారు.
స్థానికుల సహకారంతో మృతదేహాన్ని గ్రామ శివారులో ఖననం చేశారు. ఈ సంఘటన చూసిన పలువురు గ్రామ కార్యదర్శిని, స్థానికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కార్యదర్శి నరసింహరావు, మల్టీ పర్పర్ వర్కర్స్, గ్రామ యువత పాల్గొన్నారు.


TEJA NEWS