
ప్రజలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటున్న పార్టీ లీడర్ మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్
నాగర్ కర్నూలు జిల్లా
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని 11వ వార్డు విద్యానగర్ లో కాంగ్రెస్ పార్టీ లీడర్ మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ ,టౌన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యానగర్ 11వ వార్డు సమస్యలపై, సిసి రోడ్ల నిర్మాణము, డ్రైనేజీల నిర్మాణం గురించి పరిశీలించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ 11వ వార్డు అభివృద్ధి పనుల గురించి మాట్లాడడం జరిగింది. 11 వార్డు అన్ని రకాల అభివృద్ధి పథంలో నడిపింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాండురంగా రెడ్డి ,బొమ్మ ఆంజనేయులు, పుస్తకాల రాహుల్ ,జేఏసి చైర్మన్ సదానందం గౌడు ,విజయ్ కుమార్ రెడ్డి ,మూర్తి సార్ శేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు
