ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం యంత్రాలను భద్రపరచిన
స్ట్రాంగ్ రూమ్స్ నలువైపులా కేంద్ర పోలీస్ బలగాలు, జిల్లా ఆర్మ్ డ్ పోలీస్, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రతతో పాటు నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్టమైన రక్షణ వుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు కూడా తావు లేకుండా పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ… సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సిఐ రాజిరెడ్డి పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను పరిశీలించిన పోలీస్ కమిషనర్
Related Posts
కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు
TEJA NEWS కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని బాలాజీ క్వార్టర్స్ 60 యార్డ్స్ లో సొంతంగా కాలనీ వాసులు పార్క్ నిర్మించుకుంటున్నారు,గతంలో ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్న ఎన్నిసార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేదు…
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
TEJA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…