TEJA NEWS

రోడ్డుకు మరమ్మత్తులు చేసిన పోలీసులు

రోడ్డుకు మరమ్మత్తులు చేసిన పోలీసులు
ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ నుంచి కోదాడ క్రాస్ రోడ్డు వరకు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడడంతో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో శుక్రవారం రూరల్ పోలీసులు రోడ్డుపై ఏర్పడ్డ గుంతలకు మరమ్మత్తులు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులే స్వయంగా రోడ్డుకు మరమ్మతులు చేయడం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.


TEJA NEWS