The President expressed grief over the terror attack
ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిఘటనపై విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని, ఈ క్రూరమైన చర్య మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.