
ఫోక్సో యాక్ట్ 2012లో కట్టినమైన శిక్షలున్నాయి………… జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి వి. రజని.
వనపర్తి పట్టణంలోని గిరిజనుల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వి. రజని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోక్సో చట్టం అనేది అత్యంత కఠినమైన చట్టమని ఇది 2012లో అమరులోకి తెచ్చారని. ఈ కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల నుండి జీవిత ఖైదీ కూడా పడే అవకాశం ఉంటుంది . బాల్యవివాహాలు గ్రామాలలో ఇప్పటికీ జరుగుతున్నాయని ప్రతిరోజు నాలుగు వేలకు పైగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సర్వేలలో తెలుస్తుంది. విద్యాహక్కు గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి తెలియజేయడంతో పాటు త్వరలో లీగల్ సర్వీసెస్ క్లబ్బును ఈ పాఠశాలలో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్.బాలానగయ్య చీఫ్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్, జి ఉత్తరయ్య డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, గిరిజన పాఠశాల విద్యార్థినిలు మరియు సిబ్బంది లోక్ అదాలత్ సిబ్బంది స్వాతి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
