ఉపాధ్యాయులను నియమించాలని, పాఠశాలకు తాళంవేసి నీరసన వ్యక్తం చేసిన ఆరగిద్ద ప్రజలు
గట్టు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్ద గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందువల గ్రామ ప్రజలు సోమవారం పాఠశాలకు తాళం వేసి నిరసన చేశారు.అరగిద్ద గ్రామ ప్రజలు చేస్తున్న నిరసనకు PDSU జిల్లా అధ్యక్షులు హాలింపాషా సంపూర్ణ మద్దతు తెలియజేశారు.గ్రామములో 306 విద్యార్థులు ఉండగా వారికి ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయలు ఉండడం వల్ల ప్రతి రోజు విద్యార్థులకు పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అరగిద్ద ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బదిలీలో నలుగురు వెళ్ళగా ఉపాధ్యాయులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. విద్యార్థులకు న్యాయమైన విద్య అందడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.ఫోనులోఎంఈఓతో మాట్లాడగా దసరా తర్వాత నలుగురు విద్యా వాలంటీర్లను ఇస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాను విరమించారు.దసరా తర్వాత నలుగురు విద్యా వాలంటీర్లను ఇవ్వకుంటే ఎంఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమములో వీరేష్, దేవేంద్ర, సుదర్శన్, సిద్దు, అంజి, వీరేష్,శ్రీహరి, రామ్, అయ్యప్ప, మహిబు, రమేష్, తిమప్ప, షకీల్, రఫీ, విరుపాక్షి గ్రామ ప్రజలు బారి ఎత్తున పాల్గొన్నారు.