TEJA NEWS

సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
కూటమి నేతలతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ . : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో
42వ డివిజన్ పరిధిలోని శివాలయం సెంటర్ లో గురువారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ,42 వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష, 42 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు శివాజీ ముదిరాజ్ ,బీజేపీ ఊర్మిళా నగర్ మండల అధ్యక్షులు పడాల కృష్ణ కూటమినేతలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ సేవలందిస్తున్నారని వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవలు అభినందనీయమన్నారు.
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ లోని 22 డివిజన్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం సంకల్పించింది.
అందులో భాగంగా గురువారం శివాలయం సెంటర్ లో చలివేంద్రాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎన్డీఏ కూటమినేతలు పత్తి నాగేశ్వరరావు, కూనపురెడ్డి నాగభూషణం, బెన్నాభక్తుల సోమేశ్వరరావు,పత్సవ మల్లికార్జున, బ్రహ్మారెడ్డి, విజయశ్రీ, దొడ్ల రాజా తదితరులు పాల్గొన్నారు.