TEJA NEWS

అందరికీ ఆరోగ్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ :-పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించి, అందరికీ ఆరోగ్యం అందించడమే ప్రధాన ధ్యేయం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.. బుధవారం నాడు నకిరేకల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు… నిర్మాణ వివరాలను తెలుసుకొని పలు సూచనలు చేశారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ :-

95% ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి కావడం జరిగింది, ఈ నెల చివరి నాటికి పూర్తి అవుతుంది 5 ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉన్నాయి.. కార్పొరేట్ వైద్య తరలో వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తాం