TEJA NEWS

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది…….. సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పి శంకర్ గౌడ్

గత వారం పదవీ విరమణ చేసిన వనపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల స్కూల్ లో పని చేసినా శ్రీమతి సుమిత్ర ఉపాధ్యాయురాలు ను సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని వారి స్వగృహం లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్రీమతి సుమిత్ర దంపతులను వేదిక సభ్యులు శాలువా పూల మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ఒక నాటికి ఇప్పటికీ విద్యా బోధనలో చాలా మార్పులు వచ్చాయని, పోటీ ప్రపంచానికి తగిన రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 35 సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో విద్యార్థులకు నైతిక విలువలు, క్రమశిక్షణ,తో కుడినా విద్య ను మార్గదర్శనం చేయడంలో మంచి ప్రగతిని శ్రీమతిసుమిత్ర సాధించారని కొనియాడారు.
ఈనాటి కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు జనజ్వాల, వ్యాఖ్యాత బైరోజు చంద్ర శేఖర్, బండారి శ్రీనివాసులు, SCST మానిటరింగ్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు, LFL హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.