TEJA NEWS

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

సూర్యాపేట జిల్లా : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను గొడ్డలితో హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట మండలం హనుమానాయక్ తండాకు చెందిన ధరావత్ కౌసల్య అనే మహిళా అదే తండాకు చెందిన వ్యక్తితో అక్రమ సంబంధము పెట్టుకుంది. అక్రమ సంబందానికి తన భర్త ధరావత్ సైదా అడ్డు వస్తున్నాడని అతని అడ్డు తొలగించుకోవాలని ఆగస్టు 17 2024 రాత్రి 11:30 గంటల సమయములో తన భర్త సైదాను గొడ్డలితో నరికి హత్య చేసింది. మద్యం మత్తులో క్రిందపడి తలకు గాయం అవ్వడంతో చనిపోయాడని తండావాసులను నమ్మించింది.

ఈ హత్య ను నేరస్థురాలు కౌసల్య చిన్నకుమారుడు వినోద్ చూడడంతో కుమారుడికి నచ్చచెప్పి హత్య విషయము బయట వస్తే తాను జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తరువాత మీరు బ్రతకడము కష్టం అవుతుంది అని వినోద్ కు నచ్చచెప్పడం తో విషయం ఎవరికీ తెలియకుండా పోయింది. సెప్టెంబర్ 22 2024 న కౌసల్య తన చిన్న కొడుకు వినోద్ తో గొడవ పెట్టుకోగా వినోద్ తన తండ్రిని తన తల్లి హత్య చేసిన విషయము తన అన్న సాయికుమార్ తో తెలిపాడు. సాయి కుమార్ ఈనెల 23న సూర్యాపేట రూరల్ పోలీసు స్టేషన్ లో తన తల్లిపై పిర్యాదు చేసాడు సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలు నాయక్ కేసు నమోదు చేయగా, జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ సూచనల మేరకు, డిఎస్పీ రవి ఆధ్వర్యంలో సూర్యాపేట రూరల్ సీఐ సురేంధర్ రెడ్డి పరిశోధన చేసి మంగళవారం నేరస్థురాలు ధరావత్ కౌసల్య ను అరస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన గొడ్డలిని సీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.


TEJA NEWS