PM Modi: జనవరి 22 కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది: అయోధ్య ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో మోదీ
అయోధ్య: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో మరికొద్ది రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ మహత్కార్యం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు..
శనివారం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని.. ఈ ఆధ్యాత్మిక నగరంలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ”అయోధ్య విమానాశ్రయానికి.. త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరు పెట్టడం జన్మధన్యంగా భావిస్తున్నా. రోజుకు 10 లక్షల మందికి సేవలు అందించేలా ఈ ఎయిర్పోర్టును నిర్మించాం. రద్దీ మేరకు రహదారులు విస్తరిస్తాం. అయోధ్యధామ్లో ఎక్కడ చూసినా రామనామం వినిపించాలి. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని వసతులతో టౌన్షిప్లు నిర్మిస్తున్నాం” అని వెల్లడించారు..