TEJA NEWS

లేడీ కానిస్టేబుల్ ను నరికి చంపిన తమ్ముడు

రంగారెడ్డి జిల్లా:
తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య చోటు చేసు కుంది. లేడీ కానిస్టేబుల్ ను నరికి చంపాడు సొంత తమ్ముడు.

ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది, హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణిని, సొంత తమ్ము డు ప్రసాద్,దారుణంగా హత్య చేశాడు

సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె ఇటీవల కులాంతర వివాహం తీసు కుందని, ఆమె కుటుంబ సభ్యులుఆమెపై చాలా రోజుల నుండి ఆగ్రహంతో ఉన్నారు.

సమయం కోసం వేచి చూచిన తమ్ముడు ఉదయం బైకుపై డ్యూటీ కి వెళ్తున్న నాగమణిని రాయపోలు, ఎండ్లగూడ, రోడ్డు మార్గంలో కారుతో ఢీ కొట్టి అనంతరం కత్తితో మెడపై నరికి చంపాడు..

ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…


TEJA NEWS