TEJA NEWS

పదవ తరగతి పరీక్షలలో ప్రభంజనం సృష్టించిన తిరుమల కుంట విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, మండలం తిరుమలకుంట గ్రామం.

అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు మామిళ్ళ వారి గూడెం, హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు, మొన్న జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాల లో ఉత్తీర్ణత మరియు అధిక మార్కులు
సాధించినటువంటి విద్యార్థులకు తిరుమలకుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరియు గ్రామస్తులు శాలువాలతో సన్మానించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, కారం సుస్మిత. ( 541) సోడెం, వెంకటరమణ ( 525). తలగాని, నాగ వెంకట భావన (517), మార్గని. వైష్ణవి (517), నారం అక్షయ (510), వీరంకి సాయి హర్షిత (507), అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో, జుజ్జూరి దుర్గారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. పానుగంటి శ్రీను,పల్లెల, రామలక్ష్మయ్య.గడ్డం యేసు, మాడి గంగరాజు, మోడియం శ్రీను, బొర్రా వెంకటేశ్వరరావు, మొద్దు మరియమ్మ, పరికిల రాంబాబు, కోర్సు రాజేష్, మోడియ వీరేశ్వరావు,తలగాని చిట్టిబాబు, ,మడకం అంజిబాబు, కొత్తపల్లి సీతారామయ్య, వీరంకి వెంకటేశ్వర్లు, ఉమ్మల లచ్చి రెడ్డి, మరియు తదితర గ్రామస్తులు పాల్గొని వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆనంద గా ఉంది అని వ్యక్తం చేశారు.