TEJA NEWS

ఇది కలెక్టర్ కార్యాలయమా..!
స్లీపింగ్ ప్యాలెసా..!!

   మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ గురించి వార్తలు వింటుంటే, ఇది ప్రజా సేవకు అంకితమైన కార్యాలయమా, లేక పగటిపూట నిద్రపోవడానికి కొత్తగా నిర్మించిన 'స్లీపింగ్ ప్యాలెసా' అని గట్టి అనుమానం కలుగుతోంది.ప్రజల పనులు అలా నానుతూ ఉంటే, ఈ ఉద్యోగులు మాత్రం హాయిగా కునుకు తీస్తున్నారు.

వీళ్ళ నిద్ర భంగిమలు చూస్తుంటే…
యోగా నిద్ర కూడా పనికిరాదేమో…!

  అనిపిస్తుంది!  ముఖ్యంగా ఆ సెల్‌ఫోన్‌ను గుండెలపై పెట్టుకొని పద్మాసనంలో నిద్రపోతున్న దృశ్యం చూస్తుంటే,ఇది దొంగల భయమో,లేక నిద్రలో కూడా సామాజిక మాధ్యమాలు వదలలేని అబ్సెషన్‌తో కూడిన ప్రేమో తెలియదు! తమకు నిద్రపట్టడానికి స్థలంతో పనిలేదని ఇంటికన్నా తమ ఆఫీసే పదిలమని నిరూపిస్తున్నారు.

ఈ వీర నిద్ర కు ముగింపు ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ?ప్రజలు మాత్రం ఈ ఉద్యోగుల పనితీరుకు దండం పెట్టాలి! అనుకుంటున్నారు