TEJA NEWS

టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌. బాపట్ల తహసీల్దారు కార్యాలయంలోని ఈ గదిని గతంలో వీఆర్వోలు ఉపయోగించుకునేవారు.

వర్షాలు పడే సమయంలో పైకప్పు నుంచి నీరుకారుతుండటంతో కొంతకాలంగా సిబ్బంది ఎవరూ దీనిలో ఉండట్లేదు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఈ గదిలోనే ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సులు ఉంచడంతో వాటి భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి గదిలో పోస్టల్‌ బ్యాలట్‌ బాక్సులను ఉంచడంపై రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గ వ్యాప్తంగా 2,899 పోస్టల్‌ బ్యాలట్ల ఓట్లకు గాను 2,719 పోలయ్యాయి.


TEJA NEWS