TEJA NEWS

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులు పై జరిగిన ఉగ్రదాడికి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకుడు : ప్రేమ కుమార్

సాయంత్రం 7 గంటలకు జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా జనసేన నాయకుడు మెండ వెంకట్ (దొరబాబు), పోతురాజు వెంకట సుభాష్, సలాది శంకర్, అంజి, సోడా సుబ్బు ల ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం లోని కే.పి.హెచ్.బి టెంపుల్ బస్ స్టాప్ నుండి రోడ్ నెంబర్ 1 కెపిహెచ్బి మెట్రో రైల్వే స్టేషన్ వరకు క్యాండిల్ ర్యాలీ తో భారత్ మాతాకీ జై ,ఉగ్రవాదం నశించాలి , ఖబర్దార్ ఉగ్రవాదుల్లారా అను నినాదాలతో చేసుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు పాల్గొన్నారు .

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ భారతీయులను అందులో హిందువులను వెతికి మరి 28 మందిపై దాడి చేసి చంపడం మహాగోరమని , ఉగ్రవాదులను వెంటనే హతమార్చాలని , ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అంతం చేయాలని, ఉగ్రవాదాన్ని అంతం మొందించే చర్య పై భారతీయులందరూ కుల మతాలకు అతీతంగ , పార్టీలకు అతీతంగ భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పైన ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.