TEJA NEWS

భవిష్యత్ తరాలకు సంప్రదాయాలను పరిచయం చేసే వీరుల స్మరణ
జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి

ప‌ల్నాటి వీరుల ఆరాధ‌నోత్స‌వాల్లో పాల్గొన్న‌ బాలాజి

చిల‌క‌లూరిపేట‌: నాటి ప‌ల‌నాటి పౌర‌షాన్ని, వీరోచిత పోరాటాల‌ను స్మ‌రించుకుంటూ శ‌తాబ్దాల నుంచి ప‌ల్నాటి వీరుల‌ ఆరాధనోత్సవాలు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించ‌టం నాటి చ‌రిత్ర‌ను క‌ళ్ల‌కు క‌డుతుంద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి చెప్పారు. ఆయ‌న మాచ‌ర్ల జ‌న‌సేన పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త రామాంజ‌నేయులు ఆహ్వానం మేర‌కు కారంపూడిలో ప‌ల్నాటి వీరుల‌ ఆరాధనోత్సవాలకు హాజ‌ర‌య్యారు. చెన్నకేశవస్వామి, అంకాళమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద‌ర్బంగా బాలాజి మాట్లాడుతూ యుద్ధంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని మహోత్సవాల రూపంలో నేటికీ ఆచరిస్తూ న్నార‌ని వెల్ల‌డించారు. . దేశంలో ఎక్కడా లేని విధంగా యుద్ధం చేసిన యుద్ధ వీరులను స్మరించుకుంటూ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను పూజిస్తూ ప్రతిష్టాత్మకంగా పల్నాటి వీరుల ఉత్సవాలు నిర్వ‌హించ‌టం నాటి పోరాట‌యోధుల‌ను స్మ‌రించుకోవ‌డ‌మేన‌న్నారు. పల్నాటి చరిత్రను ప్రతిబింబించే ఈ ఉత్సవాలు కారంపూడ


TEJA NEWS