మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరం : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద …
75వ వనమహోత్సవ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా కూకట్ పల్లి జోన్ పరిధి జిహెచ్ఎంసి జంట సర్కిళ్లయిన కుత్బుల్లాపూర్, గాజుల రామారం మున్సిపల్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మొక్కలను నాటి పనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ భూమిపై చెట్లు విస్తృత స్థాయిలో పెంచినప్పుడే సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండటంతో పాటు వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, ఉప కమిషనర్లు మల్లారెడ్డి, నర్సింహా వివిధ విభాగాల అధికారులు, అర్బన్ బయోడైవర్సిటీ మేనేజర్ రఘువీర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, స్థానిక సంక్షేమ సంఘాల నాయకులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, దేవరకొండ శ్రీనివాస్, సాజీద్ తదితరులు పాల్గొన్నారు.