చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి …
చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని చాకలి సంగం నాయకుల వినతి…. విగ్రహం ఇప్పిస్తానని తెలిపిన కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో తెలంగాణ పోరాట యోధురాలు స్వర్గీయ శ్రీ చాకలి ఐలమ్మ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటానికి భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి, తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి, మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత..చాకలి ఐలమ్మ గారని కొనియాడారు. భౌరంపేట్ లో చాకలి ఐలమ్మ విగ్రహా ఏర్పాటుకు కృషి చేయాలని సంగం నాయకులు కోరగా తన వంతుగా విగ్రహానికి అయ్యే ఖర్చు మొత్తం తానే అందిస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో చాకలి సంగం నాయకులు చాకలి సత్తయ్య, చాకలి జీతయ్య, చాకలి అశోక్, చాకలి నర్సింహ, చాకలి అంజయ్య, చాకలి రాజు మరియు సంగం నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.