
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన పార్టీ TRS…. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో ఈ నెల 27 న జరిగే BRS రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన తలసాని శ్రీనివాస్ యాదవ్
1969 లొనే తెలంగాణ ఉద్యమం పుట్టినా… మధ్యలోనే నీరుగార్చారు
అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం కు జరుగుతున్న అన్యాయాలకు స్వరాష్ట్ర సాధనే లక్ష్యమని kCR భావించారు
రాష్ట్ర సాధన కోసం KCR నాయకత్వం లో TRS పార్టీగా పురుడు పోసుకుంది
అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా నే తెలంగాణ రాష్ట్రం సిద్దించింది
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనే లక్ష్యం తో పదవులకు రాజీనామా చేశారు
ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి తెలంగాణ రాష్ట్రం సాధించిన చరిత్ర KCR కే దక్కుతుంది
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా KCR నాయకత్వం లో అన్ని రంగాలలో విశేష అభివృద్ధి సాధించింది
ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఘనత కూడా నాటి TRS నేటి BRS కే దక్కుతుంది
పది సంవత్సరాల BRS ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు
ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన దేశంలోనే ఏకైక పార్టీ కాంగ్రెస్
అనేక మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్
15 నెలల పాలనలో అసమర్ధ పాలనతో ప్రభుత్వం అబాసు పాలైంది
ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు
మళ్ళీ KCR ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు
27 వ తేదీన జరిగే రజతోత్సవ సభ కుంభమేళా ను తలపించనున్నది
ప్రజలు స్వచ్ఛందంగా సభకు వచ్చి KCR నాయకత్వాన్ని బలపరిచేందుకు సిద్ధం అవుతున్నారు
