హైదరాబాద్: మేడారం మహా జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే బస్సులు అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. రద్దీ అధికంగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
‘‘మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్ద మొత్తంలో మేడారం జాతరకు బస్సులను తిప్పుతున్నందున రెగ్యులర్ సర్వీసులను తగ్గించాం. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశముంది. ఈ సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలి. మేడారం జాతర పూర్తయ్యే వరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నా. తెలంగాణకే తలమానికమైన ఈ పండుగను విజయవంతం చేసేందుకు ప్రజలంతా సహకరించాలి’’ అని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు…
6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…