
తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం కొత్త రాజాపేట లో జరుగుతున్న మహా కూటములు ప్రార్ధనలో పాల్గొనాలని దైవజనులు బ్రదర్ షాలేమ్ రాజు ప్రత్యేకంగా కోరిన మీదట రాత్రి జరిగిన కూటమిలో పాల్గొని బ్రదర్ షాలెంరాజు గురించి మాట్లాడుతూ షాలెంరాజు ధన్యజీవి ప్రొద్దున లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు కూడా దేవుని సేవలోనే ఉన్నాడు. దేవుడి మాటలే చెప్తున్నాడు. ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రజలకు ఉపయోగపడే మాట, అది మనల్నందరినీ ఉద్ధరించే మాట అని తెలియజేస్తూ దేవుడు ఆయనకి నిండు నూరేళ్ళూ ఆయుష్షు ఇవ్వాలని ఇంకా మరింత మందికి ఉపయోగపడేలా ఆయన జీవితం కొనసాగాలని కోరుకుంటున్నానని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ అన్నారు.
ఈ ప్రార్థన కార్యక్రమంలో వారి వెంట గేరా లింకన్ , సాతులూరు కోటి , ఇమ్మడి జానకిపతి , గ్రంధి ఆంజనేయులు , శరత్ చంద్ , రావూరి దాసు , జమీర్ , ఆరా సుభాని , హమద్ , నరేంద్రరెడ్డి , మహబుల్లా , కళ్యాణ్ MK , కొప్పుల రత్నకుమార్ , కొప్పుల దినకర్ , ప్రత్తిపాటి విజయ్ , లింగాల విజయ్ యాదవ్ , సంగీత్ తదితరులున్నారు.
