Spread the love

లష్కరులో నిరాటంకంగా అభివృద్ధి పనులు : పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : గత పదేళ్ళ కాలంలో సికింద్రాబాద్ లో తాము ప్రారంభించిన చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగిస్తామని, అందుకు ఎన్ని కష్టాలైన ఎదుర్కొనందుకు సిద్దమని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ డివిజన్ పరిధిలో ని భవానీ నగర్ లో రూ.20 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న సి.సీ. రోడ్డు నిర్మాణం పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సితాఫలమండీ పరిధిలో అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్ సామల హేమ తో పాటు జీ.హెచ్.ఎం.సీ.,జలమండలి, రెవిన్యూ అధికారులు విద్యా సాగర్, స్వర్ణ లత, కౌశిక్, కుశాల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.