కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఖండిస్తూ వెంటనే రాజీనామా చేయాలి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఖండిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ద్వారా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్‌ను కించపరిచేలా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంబేద్కర్‌ను అవమానిస్తే దేశం సహించబోదన్నారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మతోన్మాద మంత్రికి బుద్ధి ప్రసాదించాలని వారు ఎద్దేవా చేశారు.
దేశానికి దిశా నిర్దేశం చేసిన అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు డా || అవిజె జేమ్స్, డీసీసీ ఉపాధ్యక్షులు దమ్ముని శ్రవణ్ కుమార్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ శ్రీనివాస్ రెడ్డి, గడ్డం రాజేందర్ రెడ్డి, కోలన్ రాజశేఖర్ రెడ్డి, 129 డివిజన్ మాజీ కార్పొరేటర్ పాల క్రిష్ణ, బహదురుపల్లి మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు బేకు శ్రీనివాస్, సోమన్న శ్రీధర్ రెడ్డి, గణేష్, పండరి రావు, ఎండి లాయక్, సంతోష్ ముదిరాజ్, ఇరుగు రాధాక్రిష్ణ ,జెస్సీ పల్, ప్రేమ్ సాగర్, శ్రీశైలం యాదవ్, పుల్లెం రాజు, సంపంగి వెంకటేష్, షఫీ, భాస్కర్ రెడ్డి, రాజు చారి, పద్మ రావు, శ్రీనివాస్ గుప్తా, సురేందర్ రెడ్డి, అజయ్, గఫ్ఫార్, రవీందర్ నాయక్, అజిమ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.