అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. మొన్న ఓ వైకాపా నేత నాలుగు బొట్టు బిళ్లల స్టికర్లు ఇచ్చి ఓట్లు అడిగితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీ గ్లాసులను ప్రచారానికి వాడుకుంటున్నారు. కాగితపు టీ కప్పుపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల చిత్రాలు, పార్టీ గుర్తు ముద్రించి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు అనుచరులు మంగళ, బుధవారాల్లో సత్తెనపల్లిలో తొలివిడతగా సుమారు 70 టీ దుకాణాలకు 200 చొప్పున టీ కప్పులను ఉచితంగా అందజేశారు. కొందరు వాటిని తీసుకోబోమంటే.. ఒత్తిడి చేసి మరీ ఇచ్చారు. దీనిపై తెదేపా నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మొత్తానికి దుకాణాల్లో తనిఖీలు చేసి కొన్ని టీ కప్పులను స్వాధీనం చేసుకున్నారు….
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడం
Related Posts
కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట
TEJA NEWS కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట• పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు• ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి• త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక…
రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్
TEJA NEWS రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు,…