TEJA NEWS

వాలంటీర్లను నమ్మించి నట్టేట్లో ముంచిన వైకాపా, తెలుగుదేశం పార్టీలునియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం రాధాకృష్ణ

చిలకలూరిపేట:విద్యావంతులైన నిరుద్యోగ యువతను స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండూ పోటీ పడుతున్నాయని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త యం రాధా కృష్ణ విమర్శించారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సృష్టించిన వాలంటీర్ వ్యవస్థలో తమ పార్టీ కార్యకర్తలను నియమించి ప్రభుత్వ ఖజానా నుంచి వారికి తూ..తూ మంత్రంగా గౌరవ వేతనం ఇచ్చి ఐదు సంవత్సరాల పాటు శ్రమను దోపిడి చేసి వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించకుండా గాలికొదిలేసి తీవ్రమైన అన్యాయం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు తాము అధికారంలోకి వస్తే గౌరవ వేతనాన్ని ఐదువేల నుండి పదివేలకు, పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నేడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా నిరుద్యోగ యువతకు ద్రోహం చేశారని ఆరోపించారు. గత ఐదేళ్ళ వైకాపా పాలనలో జాబ్ కేలండర్ విడుదల చేయకుండా విద్యావంతులైన నిరుద్యోగ యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తే నేడు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడ గొట్టడం ద్వారా తెలుగు దేశం ప్రభుత్వం దారుణం గా వ్యవహరించిందని అన్నారు.

వైకాపా ప్రభుత్వంలో సైనికులు వలే శ్రమించిన వాలంటీర్లను కొనసాగించే జి.వో విడుదల చేయకపోవడం, వారి ఉద్యోగాలు రెన్యువల్ చేయకపోవడం ద్వారా నేడు వాలంటీర్లు నిరుద్యోగులుగా మారడానికి కారణం అయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వాలంటీర్లకు మాటలు ద్వారా శుష్క వాగ్దానాలు చేసి చేతల్లో శూన్య హస్తాలు చూపించారని రాధాకృష్ణ విమర్శించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్లు లో జగన్ రెడ్డి మాటలు నమ్మి ఒక లక్ష మంది రాజీనామా చేయగా చంద్రబాబు మాటలు విని ఒకటిన్నర లక్షల మంది తమ విధిని నిర్వర్తించారని అన్నారు . వైకాపా తెలుగుదేశం రెండు పార్టీలు కూడా నిరుపేద నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన విధానాన్ని రాధాకృష్ణ ఖండించారు. వాలంటీర్లకు రెండు పార్టీలు చేసిన అన్యాయానికి, ద్రోహానికి వ్యతిరేకంగా చేసే ధర్మ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని రాధాకృష్ణ చెప్పారు. వాలంటీర్లు ఇప్పటివరకు వైకాపాతో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని తెంచుకొని నమ్మించి ద్రోహం చేసిన వైకాపా తెదేపా లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే అండగా నిలుస్తామని రాధాకృష్ణ అన్నారు.


TEJA NEWS