TEJA NEWS

విజయా బ్రాండ్‌నూ అద్దెకిచ్చేశారు – 25 పైసలకు!

జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు బయటకు వస్తే అవాక్కవడానికి సమయం ఉండదు. ప్రతి నిర్ణయానికి అవాక్కవ్వాల్సిందే. ఇది కూడా అలంటిదే. కృష్ణా జిల్ల పాల ఉత్పత్తిదారుల సంఘానికి చెందిన విజయా బ్రాండ్ ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ సహకార డెయిరీలు విజయా బ్రాండ్ పేరుతో ఉత్పత్తులు అమ్ముతాయి. ఇలాంటి బ్రాండ్ ను .. ప్రైవేటు కంపెనీలకు అద్దెకిచ్చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం.

విజయా బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులు అమ్ముకోండి.. ఒక్కో ప్యాకెట్‌కు పావలా మాత్రం ఇవ్వండి చాలు అని ఒప్పందం మీద బ్రాండ్ ను అద్దెకిచ్చేశారు. ఇదే సందనుకుని ప్రైవేటు డెయిరీలు మావి విజయా డెయిరీ పాలేనని చెప్పి అమ్మేసుకుంటున్నారు, వారు క్వాలిటీ మెయిన్ టెయిన్ చేస్తే పర్వాలేదు చేయకపోతే నష్టపోయేది విజయా బ్రాండే. విజయా డెయిరీ పాలు ఇంత నాసిరకంగా ఉంటాయా అనిప్రజలు అననుకుంటే దశాబ్దలుగాగా రైతుల కష్టపడి నిర్మించుకున్న బ్రాండ్ వాల్యూ మంటగలిసిపోతుంది. అదీ కూడా పావలాకు.

జగన్ రెడ్డి తన కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ బ్రాండ్ ను బస్తాకు పాతిక రూపాయలు తీసుకుని ప్రైవేటు కంపెనీలకు ఇస్తారా.. చాన్సే లేదు. ఎందుకంటే బ్రాండ్ విలువ ఎంటో ఆయనకు బాగా తెలుసు. తెలుగు కాబట్టి వ్యాపారవేత్త అయ్యారు. మరి అదే బ్రాండ్ వాల్యూనూ విజయాడెరీ విషయంలో ఎందుకు కాపాడాలని అనుకోలేదు ?. రైతులు పెంచుకున్న ఓ సంస్థ నమ్మకాన్ని పావలాకు ఎలా అద్దెకు ఇచ్చేయాలనిపించింది ?. ఇక్కడే ఆయన పరిపాలనలో ప్రాధాన్యాలను అర్థం చేసుకోవచ్చు. ఒక్క చాన్స్ ఇచ్చినందుకు దిద్దుకోలేనంత డ్యామేజ్ చేసి పోయారు.


TEJA NEWS