
వికారాబాద్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా BRS పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు: మెతుకు ఆనంద్
BRS పార్టీ ఆవిర్భవించి 25 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా నిన్న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరిగిన రజతోత్సవ సభ కు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు మరియు కేసిఆర్ అభిమానులు పెద్ద ఎత్తున బస్సులు మరియు ప్రత్యేక వాహనాల్లో తరలి రావడంతో సభ విజయవంతమైంది.
వికారాబాద్ నియోజకవర్గం మరియు వికారాబాద్ జిల్లా నుండి వేలాదిగా తరలివచ్చిన నాయకులు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.
అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లకు క్షేమంగా తిరిగి చేరుకోవడం సంతృప్తినిచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సభను అడ్డుకోవాలని ఎన్ని కుట్రలు పన్నిన ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు.
సభ విజయవంతం కావడంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఇది ఆరంభం మాత్రమే. రాబోవు రోజులలో బీఆర్‌ఎస్ పార్టీ 25 వసంతాల వేడుకలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.
ఇకనుంచి అడుగడుగునా ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తాం, ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొస్తామని ప్రధాన ప్రతిపక్షంగా, వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా తెలియజేస్తున్నాను.
మరొకసారి వికారాబాద్ నియోజకవర్గం మరియు వికారాబాద్ జిల్లా నుండి వేలాదిగా తరలివచ్చిన నాయకులు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు
