TEJA NEWS

ప్రముఖ సినీ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ మృతి?

హైదరాబాద్:
జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినీ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్, కన్ను మూశారు. మొదట మరాఠీ సినిమాల్లో పనిచేసిన ఆయన తర్వాత పలు హిందీ చిత్రాలలో నటించారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి అయన ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు అందుకున్నారు.

విక్రమ్ గైక్వాడ్, మరణ వార్త తెలుసుకున్న మహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, నివాళుల ర్పించారు ఆయన మరణం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. సినిమా రంగానికి ఆయన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.

విక్రం గైక్వాడ్, మరణం పట్ల చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు నివాళులర్పిం చారు. ఈరోజు సాయంత్రం 4:30 నిమిషాలకు ముంబైలోని దాదర్, శివాజీ పార్కు స్మశాన వాటికలో ఆయన అంతక్రియలు జరగనున్నాయి.. ఆయన మరణానికి గల కారణాలు తెలియ రాలేదు.