TEJA NEWS

వీర బ్రహ్మేoద్ర కామాక్షి సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వ కర్మ జయంతి వేడుకలు.
పరవాడ : సెప్టెంబర్ 17 వీర బ్రహ్మేoద్ర కామాక్షి సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వ కర్మ జయంతి వేడుకలు పరవాడ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సిరపురపు అప్పలనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ వీరబ్రహ్మేoద్ర స్వామి వారి చిత్ర పటానికి పూల మాల వేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జరుపుకునే విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమలో పెద్ద చెరువు ఆయకట్టు సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీను , అనకాపల్లి జిల్లా సాంస్కృతిక విభాగ టిడిపి అధికార ప్రతినిధి పైలా రామచంద్ర రావు, వెదురుపర్తి వెంకట సురేష్ కుమార్ దంపతులు, శ్రీ వీరబ్రహ్మేంద్ర కామాక్షి సేవా సంఘం సభ్యులు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS