TEJA NEWS

బస్తీ దవాఖానాల సందర్శన

ఫతేనగర్ డివిజన్ పరిధిలో జింకలవాడ మరియు ఇందిరా గాంధీపురంలో బస్తీ దవఖానాలను స్థానిక ప్రజలు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది
హాస్పటల్లో సందర్శించినప్పుడు రోగులకు సంబంధించిన కనీసం టాబ్లెట్స్ గాని షుగర్ టెస్టులు చేయడానికి కావలసిన పరికరాలు గానీ ఏవీ అందుబాటులో లేకపోవడంతో గత బి ఆర్ ఎస్ హయాంలో రోజు 200 నుండి 250 మంది రోగుల సంఖ్య ఉండేది ఈ టాబ్లెట్లు ఏవి అందుబాటులో లేకపోవడం వల్ల రోగుల సంఖ్య 30 నుంచి 50కి పడిపోయింది


కార్పొరేటర్ సతీష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు ఈరోజు బస్తీ దావాఖానాలు సందర్శించడం జరిగింది కేసీఆర్ ఒక మంచి ఆలోచనతో పేద ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యం అందించాలని ఉద్దేశ్యంతో బస్తీలో ప్రజలు హాస్పటల్ కు వెళ్లే కనీస ఆరోగ్య పరీక్షలు చేసుకునే ఆర్థిక స్తోమత లేక వారి వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారని ఉద్దేశంతో బస్తీలలో దవకాణాలను ఏర్పాటు చేయడం జరిగింది దవఖన లు ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు రోజుకు రోగులు 200 నుంచి 250 మంది ప్రజలు వచ్చి బస్తీ దవఖాన సేవలు వినియోగించుకునేవారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బస్తీ దవాఖానలో కనీసం జలుబు దగ్గు బీపీ టాబ్లెట్లు కూడా లేకుండా షుగర్ టెస్ట్ చేయడానికి పరికరాలు కూడా లేనందున ప్రజలు ఇప్పుడు 20 నుంచి 50 మంది మాత్రమే రోగులు హాస్పిటల్ కి వస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవాలి రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో బస్తీ దవాఖనలను నిర్వీణ్యం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి అతి త్వరలో దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని లేని యెడల పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతాం అని హెచ్చరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది


TEJA NEWS