వక్ఫ్ బోర్డ్ వ్యథ తీర్చెన్… ప్రజల మనసులు మరోమారు గెలిచెన్…
వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కరించినందుకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి ధన్యవాదాలు తెలిపిన పద్మానగర్ ఫేజ్ – 2 వాసులు…
పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1, పద్మా నగర్ ఫేజ్ -2 సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వక్ఫ్ బోర్డు సమస్యతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించేలా సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సంధర్బంగా పద్మనగర్ ఫేజ్ -1, ఫేజ్ -2 వాసులు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లోని 55 కాలనీలలో, 171 సర్వే నెంబర్లలో గత కొన్ని రోజులుగా వక్ఫ్ బోర్డు పేరుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేశారు. ఈ కాలనీలలోని దాదాపు 90 శాతం మంది ప్రజలు అప్పులు చేసి, లోన్లు తీసుకొని పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్లాట్లు కొని పెట్టుకుంటే వక్ఫ్ బోర్డు పేరుతో ప్రజలను వ్యధకు గురిచేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ దృష్టికి తీసుకురాగా ఇప్పటికే పలుమార్లు ఆర్డీవో, కలెక్టర్, డిఆర్, డిఐజి, ఐజీ వంటి ఉన్నతాధికారులను కలిసి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే ప్రజల పక్షాన పోరాడి సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ నాకు మద్దతుగా నిలిచి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన కుత్బుల్లాపూర్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మా నగర్ ఫేజ్ -1 అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, పద్మా నగర్ ఫేజ్ -2 అధ్యక్షులు సత్తిరెడ్డి, సంక్షేమ సంఘాల సభ్యులు పప్పిరెడ్డి సురేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, సతీష్, అప్పారావు, మురళీ, బ్రహ్మానందం, దేవేందర్ రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.