
కనీసం 20రోజులు అసెంబ్లీ నడపాలని డిమాండ్ చేశాం
మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలి
ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్ ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని లేవనెత్తాం
బిల్లులు చెల్లింపుకు 20% కమిషన్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని కోరాం
రైతాంగ సమస్యలు, తాగు, సాగు నీటి సమస్యలపై, ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవటంపై చర్చించాలని కోరాం
సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిపోవడం, పెద్దవాగు కొట్టుకుపోవడం, వట్టెం పంప్ హౌస్ మునిగిపోవడం, SLBC టన్నెల్ కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశాం
కృష్ణా నదీ జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దీనిపై సభలో చర్చించాలని చెప్పాం – బీఏసీ సమావేశం తర్వాత హారీష్ రావు చిట్ చాట్
