మన అభ్యర్థితోనే మన అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
*126 – జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు మద్దతుగా నిర్వహించిన ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపిస్తే జరిగే అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, మహిళా నాయకురాలు ఇందిరాగౌడ్, సీనియర్ నాయకులు అజ్రత్ అలీ , అజం, పాపులు గౌడ్, పాపిరెడ్డి, జైహింద్, విఠల్, వాసు, ప్రభాకర్, మల్లారెడ్డి, వెంకటేష్, రాజేష్, సన్నీ బాయ్, లక్ష్మణ్, బ్రహ్మానంద చారి, రామకృష్ణ చారి, నరసింహారెడ్డి, గిరి, బాలరాజు, మహమూద్, సంతోష్, లక్ష్మణ్, మహంకాళి, నాయకురాలు శాంతి, శోభ తదితరులు పాల్గొన్నారు.