TEJA NEWS

వన మహోత్సవంలో ప్రథమ స్థానంలో ఉన్నాం,,,,. ఇదే ఓరవాడిని కొనసాగించండి,,,, వెంకయ్య గౌడ్ ఎంపీడీవో శంకరపల్లి

శంకర్ పల్లి మండల పరిధిలోని గ్రామాలలో వన మహోత్సవం కార్యక్రమం స్థితిగతులను ఎంపీడీవో కార్యాలయంలో జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీఓ మరియు ఏపీవోలతో కలిసి సమీక్ష చేసిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్, బుధవారం మండల అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ తన చాంబర్ లో మండల పరిధిలోని గ్రామాలలో జరుగుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను పంచాయతీ సెక్రెటరీల తో మాట్లాడి తెలుసుకున్నారు, మండల పరిధిలోని గ్రామాలలో జరుగుతున్న మొక్కలు నాటే కార్యక్రమము లో రైతులను భాగస్వామ్యులను చేస్తూ చేపట్టవలసిన చర్యల గురించి పంచాయతీ సెక్రటరీలకు తగు సూచనలు చేశారు, మండల పరిధిలో పంచాయతీ సెక్రెటరీలు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారని, సెక్రటరీల పనితీరును అభినందించారు, మీరు అందరు చేస్తున్న పని ఫలితంగా రంగారెడ్డి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నామని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత ఉదృతంగా చేపట్టి ఈ స్థానాన్ని పదిల పరచుకొని వన మహోత్సవం కార్యక్రమం పూర్తయ్యే వరకు శంకర్పల్లి మండలాన్ని ప్రస్తుతం కొనసాగుతున్న ప్రథమ స్థానంలో కొనసాగేటట్లు పంచాయతీ సెక్రెటరీలు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కష్టపడి పూర్తి సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ గిరిరాజ్ ఏపీవో నాగభూషణం మరియు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు


TEJA NEWS