స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం
సాక్షిత
ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ అన్నారు. స్థానిక ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ప్రెస్ క్లబ్ లో ధర్మ సమాజ పార్టీ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ అన్ని మండలాల్లో పార్టీ బలోపేతం చేయడానికి సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని మండలాల్లో, గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల కమిటీ ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పై ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మంద జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కార్యదర్శి డిబి .రాజు, జిల్లా నాయకులు ప్రసన్న, అనిల్,దీపక్,సురేష్,ప్రశాంత్,మల్లేశం,ఎల్లయ్య,సురేష్,అంజిబాబు,కనకరాజు,రాజశేఖర్ ఉమ్మడి మెదక్ జిల్లా ( డి ఎస్ యు ) ఇన్చార్జి సురేష్ తదితరులు పాల్గొన్నారు.