
శ్రీయుత గౌరవనీయులైన HMWSSB అధికారి ని నమస్కరించి వ్రాయునది ఏమనగా
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ గ్రామంలో చాలా రోజులుగా మంచి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత నాలుగు సంవత్సరాలనుండి మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో DGM కి మరియు కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో కూడా ఎన్నోసార్లు పిర్యాదులు చేసి విన్నవించుకోవడం జరిగింది ఇంతవరకు సమస్య కు పరిష్కారం చూపింది లేదు స్థానిక HMWS అధికారుల నిర్లక్ష్యంమా ఏందో అర్థం అయితలేదు ప్రజలకు పూర్తి స్థాయిలో నీటి పరిష్కారం చూపేవరకు ఇప్పటి వరకు విధించిన నీటి బిల్లులు కూడా రద్దు చేయాలని కోరడం జరిగింది.
బౌరంపేట్ లో రిజర్వాయర్లు పూర్తి అయి కూడా సంవత్సరం అవుతుంది కానీ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోకపోవడం విచిత్రం వెంటనే ఆ యొక్క రిజర్వాయర్లు ప్రారంభించి పాత గ్రామపంచాయతీ ఏరియా బౌరంపేటకు మంచి నీళ్లు అందించగలరని కోరుకుంటూ
మరియు మున్సిపల్ పరిది చర్చ్ గాగిల్లాపూర్ కూడా తీవ్ర నీటి సమస్య ఇంతవరకు ఆ ఏరియాలో నీటి పైప్ లైన్లు వేసింది లేదు ఇప్పటి ఆ ఏరియాలో బోర్ల ద్వారానే నీరు సప్లై అవుతుంది అదికూడా అరకొరనే ఆ వచ్చే నీళ్లలో పూర్తి కెమికల్ నీళ్లు వస్తున్నాయి ఆయొక్క నీటిని వాడితే దుర్గంధంతో పాటు చర్మ వ్యాధులు వస్తున్నాయి కావున ఈయొక్క సమస్యపై స్పందించి వెంటనే పరిష్కారం చూపగలరని మనవి
