
తిరుమలలో దివ్యదర్శన టోకెన్ల జారీ ఎప్పుడు?
తిరుమల : ఏపీలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వస్తున్న వారికి గతంలో ఉన్న ప్రయోజనాలను పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు. వేసవి నేపథ్యంలో రెండు నడకదారుల్లో వచ్చేవారి కోసం దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వడంతో పాటు కోటా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో అలిపిరి నడకదారిలో 14 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 6 వేల చొప్పున నిత్యం 20 వేల దివ్యదర్శన టోకెన్లు ఇచ్చేవారు.
