పెద్దగూడెం డబల్ బెడ్ రూమ్ లా సమస్యలు తీర్చేది ఎవరు….?మున్సిపాలిటీన…. గ్రామపంచాయతీయా….!
మా గోడు పట్టించుకోండి కలెక్టర్ మహాప్రభో
వనపర్తి : *
గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ పరిధిలోని 33 వార్డులలో సొంతిండ్లు లేనినిరుపేదల కుటుంబాలకు పట్టణానికి, పెద్దగూడెం గ్రామం మధ్యలో గుట్ట ప్రాంతానికి అనుకుని దాదాపుగా 38 బ్లాక్లు 296 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి వనపర్తి మండలం ఎమ్మార్వో మున్సిపాలిటీ కౌన్సిలర్లు సహకారంతో డిప్పుల ద్వారా ఇండ్లను కేటాయించి సంవత్సరం క్రితమే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాం లోనే పట్టాల పంపిణీ చేసి లబ్ధిదారుల గృహప్రవేశం చేయించడం జరిగింది మంత్రి ఉన్నంతకాలం మున్సిపాలిటీ అధికారులు తమకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఆ వెంటనే మున్సిపల్ లో అవిశ్వాస తీర్మానం తో మున్సి పాలకులు కూడా మారడంతో పెద్దగూడెం దగ్గర ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్వహణ పరిస్థితి ఇటు పెద్దగూడెం గ్రామపంచాయతీ కి అటు మున్సిపల్ కానీ తమ పరిధిలోకి రాదు తమ పరిధిలోకి రాదంటూ అధికారులు చేతులెత్తేయడంతో ప్రాథమిక సౌకర్యాలైన విధి దీపాల నిర్వహణ నూతన విధిదీపాల ఏర్పాటు మిషన్ భగీరథ మంచినీరు సరఫరా చెత్త సేకరణ లాంటి నిర్వహణ పనులు కోరవరడం
సిసి రోడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని తమ గోడును స్థానిక నాయకులకు జిల్లా కలెక్టర్కు వినతుల ద్వారా వెళ్ళ బుచ్చిన ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే మున్సిపాలిటీ పరిధిలో ఏదో ఒక వార్డులో కిరాయి ఇళ్లల్లో ఉంటూ కూలో నాలో చేసుకుంటూ తినో తినకనో కిరాయి చెల్లిస్తూ రేషన్ బియ్యం తో పిల్లల్ని పోషించుకుంటూ చిన్నపిల్లలు అంగన్వాడి సెంటర్లకు పెద్ద పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవారని అలాగే అనారోగ్యం గురైతే ప్రభుత్వం ఆసుపత్రి లో వైద్యం చేయించుకునే వాళ్ళమని కానీ డబల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్స్ అటు పట్టణానికి ఇటు పల్లెకు కాకుండాఅడవికి గుట్ట ప్రాంతంలో ఉండడం తమ పిల్లలు చదువు కునే పరిస్థితి అందుబాటులో లేకపోవడం వారు బడికి వెళ్లాలంటే దాదాపుగా పది కిలోమీటర్లు ఉన్న వనపర్తికి రావాల్సిందే కానీ ఒకవేళ పంపించే పరిస్థితులు ఉన్న తమకు ఆర్థిక స్తోమత లేదని తమ పిల్లల చదువు భవిష్యత్తు ప్రశ్నార్థకమే నని ఇక పిల్లలు వృద్దులు ఉన్న కుటుంబాల విషయానికొస్తే ఏదైనా అనారోగ్యానికి గురైతే వారికి వైద్యం అందించడం రాత్రిపూట అయితే రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడం తోమరి కష్టంగా మారుతుందని డబల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్స్ గుట్ట ప్రాంతం కావడం అక్కడ పాములు తేళ్లు నివాసాల్లోకి వస్తుండడం దీనికి తోడు దొంగల బెడద ఎక్కువగా ఉండటంతోభయభ్రాంతులకు గురవుతున్నామని వీటికి తోడు నాటు సారా గంజాయి లాంటి మత్తు పదార్థాలతో పాటు ఖాళీగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్దకు గుర్తు తెలియని ఆడ మగ లు జంటలు జంటలుగా అక్కడికి వచ్చి అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు
రెండు మూడు నెలల్లోస్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండడం తమ ఓట్లు హక్కు మున్సిపాలిటీ పరిధిలో ఉండడం ఒకవేళ మున్సిపాలిటీ పరిధి వార్డుల నాయకులకు తమ ఓట్లు వేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలను ఎక్కడ దరఖాస్తులు చేసుకోవాలో ఎలా వినియోగించుకోవాలో ఎవరిని అడగాలో తెలియడం లేదని వ్యాపోతున్నారు ప్రభుత్వాలు పాలకులు నిరుపేదలను వారి పేదరికాన్ని వారి సొంత ఇంటి కలను ఆసరాగా చేసుకుని గృహ పథకాల పేరుతో నిర్మాణం ఉచ్చులోకి దింపి అప్పుల పాలు చేసి ఆ అప్పులు తీర్చేందుకు కట్టుకున్న ఇంటిని ఉన్న ఊరును కన్న ముసలి తల్లిదండ్రులను వదిలి బ్రతుకు తెరువు కోసం పట్టణాలకు కూలీలుగా వలస వెళ్తున్నారని అక్కడ భవన నిర్మాణ కార్మికులు గాను రోడ్డు పనుల కూలీలుగా అవతారం ఎత్తి జీవిస్తున్న క్రమంలో ప్రమాదాలు చోటుచేసు కొని కుటుంబంలో పెద్దలు ప్రమాదాల్లో మరణిస్తే వారి పిల్లలు అనాధలుగా మారుతున్నారు తండాలు పల్లెల ప్రజల పరిస్థితి ఇలా ఉంటే
ప్రస్తుతం ప్రభుత్వాలు పాలకులు పట్టణ నిరుపేదల కోసం మాత్రం చెరువులు కుంటల్లో గుట్టల పైన అడవుల మధ్యన గృహాలను నిర్మించి ఇవ్వడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నివాసం ఉంటా ప్రకృతి విపత్తుల సమయంలో చెరువుకుంటల లో నిర్మించిన నివాసాలు నీటి లో మునిగిపోవడం గుట్టల పైన అడవుల మధ్య నివాసా లలో అసౌకర్యాలతో సమాజానికి దూరంగా జీవించాల్సి వస్తుందని ఇదంతా పాలకులు అధికారులు నివాసాలకు అనువుగా లేని ప్రాంతంలో గృహాలను నిర్మించి ఇవ్వడమే కారణమని ఇదంతా నిరుపేదల సమస్యలను ప్రధానంగా చేసుకొని వారిని మళ్లీ మళ్లీ సమస్యల్లో నెట్టేసి పాలకులు ప్రభుత్వాలు పబ్బం గడుపుకుంటున్నాయని
విజ్ఞులు మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు