TEJA NEWS

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో వింటర్ కార్నివాల్

జగిత్యాల పట్టణంలోని జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ” వింటర్ కార్నివాల్” పేరిట కార్యక్రమం నిర్వహించారు. దీనిలో విద్యార్థులకు శీతాకాలం గురించి వివరించారు. ఈ శీతాకాలంలో
పగటి సమయం తక్కువగా ఉండి మరియు రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.ఈ సీజన్ చాలా ఆరోగ్యకరమైన పండ్లు మరియు కూరగాయలను తెస్తుంది. ప్రజలు తాజా ద్రాక్ష, యాపిల్స్, క్యారెట్లు, కాలీఫ్లవర్, జామ మరియు మరిన్ని తినడానికి అవకాశం పొందుతారు. ఇంకా, ఈ సీజన్‌లో చాలా అందమైన పువ్వులు వికసిస్తాయి అని అన్నారు. అదే విధంగా శీతాకాలం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ధరించాల్సిన దుస్తువుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు , ఉపాధ్యాయ బృందం , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


TEJA NEWS