
అశ్వరావుపేటలో గుండెపోటుతో మహిళ మృతి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం
అశ్వరావుపేటలో ఓ మహిళ గుండెపోటుతో నడిరోడ్డుపై కుప్పకూలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆమె విజయవాడకు చెందిన జరీనా. డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న, తన మరిది ఖలీల్ ఇంటికి వచ్చింది. తోటి కోడలు కలిసి కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై కుప్ప కూలింది. స్థానికులు ఏరియా హాస్పిటల్ కు తరలించగా, వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
