TEJA NEWS

  • – – మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి.
  • – – మహిళల రక్షణ కొరకే షీ టీం , యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీంలు.
  • – – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

జగిత్యాల జిల్లా… విద్యార్థినులు, మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో షీ టీం , యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీం ,తెలంగాణ మహిళ రక్షణ విభాగం చే నూతనంగా రూపొందించిన వాల్‌ పోస్టర్లను ఎస్పి అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ… మహిళలు బాలికల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, బాలికలు,అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా వుండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని. ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు. మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న, అలాగే ర్యాగింగ్‌ లాంటివాటికి వేధింపులకు గురౌవుతున్న మహిళలు, విధ్యార్థును లు, బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు . ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆకతాయిల పై నిరంతరం షి టీమ్ బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయి అని అన్నారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు 8712670783, డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పి లు రవీంద్ర కుమార్, రఘు చందర్, రాములు, SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఎస్సైలు గీత, శ్వేత పాల్గొన్నారు.


TEJA NEWS