TEJA NEWS

  • మనసున్న మహరాజులు వైఎస్సార్, జగన్
  • కాంగ్రెస్, టీడీపీ కుట్రలు, కుతంత్రాలు కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు
  • ఈ సినిమా విడుదల వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యులకు ఒక పండుగ
  • రాజమండ్రి ఎంపీ భరత్

రాజమండ్రి, ఫిబ్రవరి 8: ‘యాత్రా-2′ అద్భుతమైన చిత్రమని, ఇది తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మార్గాని భరత్ రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర కథానాయకుడు జీవా జగన్మోహన్ రెడ్డి పాత్రలో అత్యద్భుతంగా నటించారన్నారు. తండ్రి వైఎస్సార్ హెలికాఫ్టర్ దుర్ఘటనలో మృతిచెందడం, జగన్ ఓదార్పు యాత్ర, అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా, టీడీపీ చంద్రబాబు కుట్రలు.. ఇవన్నీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలిసిందే అయినా ఈ యాత్ర-2 ద్వారా మరోసారి ఆ మహా నేత వైఎస్సార్ ను స్మరించుకునే అవకాశం వచ్చిందన్నారు. వైఎస్సార్, ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మనసున్న మహారాజులని..వారి జీవితం ఎందరికో స్ఫూర్తి అన్నారు. యాత్ర-2 చిత్రం విడుదల నిజంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వైఎస్సార్, జగన్ అభిమానులకు ఒక పండుగ రోజని అన్నారు. వైఎస్సార్ సీఎంగా పేద ప్రజల సంక్షేమానికి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ వంటి పథకాలు ఎన్నో చేశారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రిని మచిన తనయుడిగా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తూ ప్రజారంజక పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అన్నారు. అప్పట్లో ‌జగన్ ఓదార్పు యాత్రతో కేంద్రంలోని కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తే..ఇప్పుడు జగనన్న’సిద్ధం’ ఎన్నికల ప్రచార సభలను చూసి ఏపీలో ప్రతిపక్షాలకు వణుకు ప్రారంభమైంది అన్నారు. ‌2024 ఎన్నికలు అబద్ధానికి- నిజానికీ మధ్య జరుగుతున్న యుద్ధమని..అంతిమ విజయం నిజానిదేనని, జగన్ విజయం తథ్యమని అన్నారు. ‌తొలుత యాత్ర-2 చిత్రం ప్రదర్శించిన నగరంలోని ఊర్వశి థియేటర్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఎంపీ భరత్, రాజమండ్రి లోక్‌సభ వైసీపీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా ఛైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, ఆ పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.


TEJA NEWS