TEJA NEWS

మినీ మ‌హానాడు లో టిడిపి తీర్ధం పుచ్చుకున్న వైసిపి, బిజెపి నాయ‌కులు
పార్టీలోకి కండువా క‌ప్పి ఆహ్వానించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

తిరువూరు : విస‌న్న‌పేట మండ‌లం పుట్రెల పంచాయ‌తీకి చెందిన వైసిపి, బిజెపి నాయ‌కులు తిరువూరు లో శ్రీర‌స్తు పంక్ష‌న్ హాల్ లో జ‌రిగిన నియోజ‌క‌వర్గ స్థాయి మినీ మ‌హానాడు లో టిడిపి కండువా క‌ప్పుకున్నారు. ఎ.ఎమ్.సి డైరెక్ట‌ర్ కొలికపోగు బాల‌, పుట్రెల టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు గాదె వెంక‌టేశ్వ‌ర‌రావు (జి.వి.ఆర్) ఆధ్వ‌ర్యంలో పుట్రెల పంచాయ‌తీకి చెందిన‌ బిజెపి నాయ‌కులు చండీక వేణు బాబు, వైసిపి నాయ‌కులు కొలిక‌పోగు ర‌వి అనుచ‌రులు భారీ సంఖ్య‌లో టిడిపిలో చేరారు. వీరికి ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు పార్టీ కండువాలు కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే టిడిపికి చెందిన దొడ్డ క‌విత‌, దొడ్డ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలవగా ఆప్యాయంగా వారికి పార్టీ కండువాలు కప్పటం జ‌రిగింది.