TEJA NEWS

మీరేదైనా చేయలగరు.. మీకుమీరే సాటి సార్..!

జ‌గ‌న్‌పై మరోసారి షర్మిళ సంచలన వ్యాఖ్యలు

అమరావతి : మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరేదైనా చేయగలరు.. మీకుమీరే సాటి సార్ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిళ మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డికి పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ వేల కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని, ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా సెంటర్, సబ్ మెరైన్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు సహా అదానీతో జరిగిన ఒప్పందాలన్నీ రద్దు చేయాలని, ఒక్కో ఒప్పందానికి జగన్ ఎంత లంచం తీసుకున్నారో తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు. జగన్ అక్రమాలతో ప్రజలపై వేల కోట్ల భారం పడుతోందని అన్నారు.

ప్రభాస్ ఎవరో ఇప్పటికీ నాకు తెలియదు.. జగన్ తన స్వప్రయోజనాలకోసం చెల్లి, తల్లి పేర్లను వాడుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు. బాలకృష్ణకు సంబంధించిన బిల్డింగ్ లోని కంప్యూటర్ ఐపీ అడ్రస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని షర్మిల కేసు పెట్టారని, కావాలంటే ఆమె మాటల్లోనే వినండి అంటూ వీడియో క్లిప్ ను జగన్ మోహన్ రెడ్డి అందరికీ చూపించడం జరిగిందని, ఒకవేళ జగన్ కు నిజంగానే చెల్లెలిపై ప్రేమ ఉండి ఉంటే.. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారని షర్మిల ప్రశ్నించారు. బాలకృష్ణ మీద ఎందుకు ఎక్వయిరీ వేయలేదో చెప్పాలని అన్నారు. ప్రభాస్ కూ నాకూ సంబంధం ఉందని నాపై జరిగిన అసత్య ప్రచారంపై నేను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని షర్మిల ప్రశ్నించారు.

నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకూ చూడలేదని కేసు పెట్టిన సమయంలోనే నా బిడ్డలపై ప్రమాణం చేసిన చెప్పాను. ఇప్పటికీ ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వనీ తెలిసి కూడా నాకు వ్యక్తిత్వం లేనట్లు ప్రచారం చేయించారు. ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని షర్మిల ప్రశ్నించారు. మీకు పేరు వస్తుందంటే తల్లి, చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారు. నాన్న పేరు సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారు. మీకు మీరే సాటి సార్.. అంటూ జగన్ మోహన్ రెడ్డిపై షర్మిళ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


TEJA NEWS